Site icon Prime9

SBI Asha Scholarship Program: పేద విద్యార్దులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం

SBI

SBI

SBI Foundation: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో పేద విద్యార్దులకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌కు అప్లయ్‌ చేసుకునే విద్యార్థులు 6 నుంచి 12వ తరగతులు చదువుతన్న వారై ఉండాలి. గడిచిన అకడమిక్‌ పరీక్షల్లో మినిమం 75 శాతం మార్కులతో పాసై ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలివే:
దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు గతేడాది అకడమిక్‌ పరీక్షల మార్క్‌ షీట్‌, ప్రభుత్వం అందించిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది అడ్మిషన్‌ ధృవీకరణ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఇన్‌కమ్‌ప్రూఫ్‌ (ఫార్మ్‌ 16 ఎ/ఇన్‌కమ్‌సర్టిఫికెట్‌/శాలరీ పేస్లిప్‌), అప్లయ్‌ చేసుకున్న వ్యక్తి ఫొటో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 15 చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలి.

Exit mobile version