NEET UG & PG Counselling: వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో జాయిన్ అవుదామనుకునే వారి బలహీనతలనుఆసరాగా చేసుకుని కొంతమంది దందాకు తెరతీస్తున్నారు. కాలేజీ యాజమన్యాలతో మాట్లాడి సీట్లు ఇప్పిస్తామని చెబుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఇపుడు మెడికల్ సీట్లు భారీగా పెరిగిన నేపధ్యంలో నీట్ లో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు పొందే అవకాశముందని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, కాలేజీల నిబంధనలు గమనించి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని ఆయన చెబుతున్నారు.
విద్యార్దులు గమనించాల్సిన విషయాలు.. (NEET UG & PG Counselling)
ప్రతీ మెడికల్ కాలేజీలోనూ మూడు రకాల సీట్లు ఉంటాయి. వాటిలో ఏ కేటగిరీ. బి కేటగిరీ సి కేటగిరీ(ఎన్నారై కోటా ) ఉంటాయి. డీమ్డ్ యూనివర్శిటీలలో మేనేజ్ మెంట్, ఎన్నారై కోటా సీట్లు మాత్రమే ఉంటాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పేది ఏమిటంటే ప్రవేశాలన్నీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయని. ఎన్నారైకు 15 శాతం కోటా. చాలా చోట్ల ఎన్నారై సీట్లు భర్తీ కావు. కౌన్సిలింగ్ లో అన్ని రౌండ్లు అయిన తరువాత మిగిలిన పోయిన సీట్లు కాలేజీవారికి ఇస్తారు. వారు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. బ్రోకర్లు కాలేజీ యాజమాన్యంతో మాట్టాడి సీట్లు ఇప్పిస్తామని చెబుతారు. ఇక్కడే వారు విద్యార్దులను తప్పు దోవ పట్టిస్తున్నారు. వాస్తవానికి ఎన్నారై కోటాలో దరఖాస్తు చేసుకోవాలంటే విదేశాల్లో ఉన్నవారివద్దనుంచి సదరు విద్యార్దితో ఉన్న సంబంధం గురించి చెప్పే రిలేషన్ లెటర్, రెండుఅపిడవిట్లు, బ్యాంకు స్టేట్ మెంట్, ఎంబసీ లెటర్ ఇవ్వాలి. ఫీజు వారి ఎక్కౌంట్ నుంచి సీటు వచ్చిన కాలేజీ ఎక్కౌంట్ కు డీడీ చెల్లించాలి. అయితే బ్రోకర్లు విదేశాల్లో ఉన్న వారిని ఒకరిని సంప్రదించి వారి పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. కౌన్సిలింగ్ సమయంలో గాని, సీటు వచ్చిన తరువాత గాని ఈ విషయం బయపడితే అటు సీటు, ఇటు డబ్బు రెండూ పోతాయి. వాస్తవానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నారై సీటు కొనుక్కునే బదులు మేనేజ్ మెంట్ సీట్లలో అడ్మిషన్ పొందవచ్చని డాక్టర్ సతీష్ చెబతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పొందలేని విద్యార్దులు చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బి కేటగిరీ సీట్లు పొందవచ్చు. గతంతో పోల్చితే ఇపుడు మెడికల్ సీట్లు బాగా పెరిగాయని సీట్లకు దరఖాస్తు చేసుకునేటపుడు ఈ విషయాలన్నింటిని గ్రహించాలని సతీష్ చెబుతున్నారు. ఈ సీట్లలో ప్రవేశాలకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.