JEE Mains Result 2023: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు
విడుదలయ్యాయి.
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పేపర్ 1 ( బీఈ-బీటెక్) కోర్సులకు 8.22 లక్షల మంది హాజరు అయ్యారు.
అదే విధంగా పేపర్ 2 ( (బీఆర్క్-బీప్లానింగ్) కోర్సులకు 45 వేల మంది పైగా విద్యార్థులు రాశారు.
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీ ఫిబ్రవరి 1 న విడదల చేసింది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.
అనంతరం ఫైనల్ కీ ని సోమవారం విడుదల చేసింది.
రిజల్డ్స్ కోసం..
jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలోనే జేఈఈ మెయిన్స్ 2023 రిజల్ట్స్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిపై క్లిక్ చేయండి.
లింక్ క్లిక్ చేయగానే న్యూ టబ్ లో అప్లికేషన్ నంబర్ సహా అక్కడ అడిగిన లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ కనపడుతుంది. స్కోర్ కార్డును డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
రెండో సెషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఎన్‌టీఏ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ 6 నుంచి 12 వరకూ జేఈఈ మెయిన్స్ రెండవ విడత పరీక్షలు జరగనున్నాయి.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం (ఫిబ్రవరి 7) న ప్రారంభం అయింది. ఈ రిజిస్ట్రేషన్స్ మార్చ్ 7వ తేదీ వరకూ చేసుకోవచ్చు.
సెషన్ 1 రాసిన విద్యార్థులు సైతం రెండో సెషన్ ధరఖాస్తు చేసుకోవచ్చు. రెండ్ సెషన్ పూర్తి అయిన తర్వాత ఎన్‌టీఏ.. ఆల్ ఇండియా ర్యాంకులను ప్రకటిస్తుంది.
రెండో సెషన్ కు సంబంధించిన దరఖాస్తులు https://jeemain.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎన్‌టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్ రెండవ సెషన్ పరీక్షల నగరాల వివరాల్ని మార్చి మూడవ వారంలో, పరీక్షల అడ్మిట్ కార్డుల్ని మార్చి చివరి వారంలో విడుదల చేయవచ్చు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/