Site icon Prime9

Five year integrated courses: ఇండియాలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేయడం మంచిదేనా?

Five year integrated courses

Five year integrated courses

Five year integrated courses:  ఇండియాలో పలు యూనివర్శిటీలు 12 వ తరగతి పూర్తయ్యాక ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో హ్యుమానిటీస్, సైన్స్. ఇంజనీరింగ్, తదితర కోర్సులు ఉన్నాయి. ఐదేళ్లు చదివితే పీజీ పట్టా వస్తుంది. అయితే ఈ కోర్సులన్నీ మంచివేనా? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ ఏమంటున్నారంటే కోర్సులు, కాలేజీలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

కొంతమందికి కొన్ని కోర్సులు మంచివి. ఒక యూజీ కోర్సును, పీజీ కోర్సును కలిపి ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీలు,ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇవి సబ్జెక్ట్స్ లోని క్రెడిట్స్ పై ఆదారపడి ఉంటాయని సతీష్ చెబుతున్నారు. పీజీకి 30 నుంచి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఐదేళ్ల ఇంటిగ్రెటెడ్ కోర్సులో జాయిన్ అయ్యాక మధ్యలో డిగ్రీ అయ్యాక ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తున్నారు. జనరల్ గా ఎంబీఏ కోర్సుకే ఈ ఆప్షన్ దొరుకుతోంది. అయితే ఐఐఎంలలో ఈ కోర్సు అడ్మిషన్ వస్తే చేయవచ్చని మిగిలిన చోట్ల అనవసరమని ఆయన తెలిపారు.

కాలేజీని బట్టి ఉంటుంది..(Five year integrated courses)

ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయిన వారికి నాలుగేళ్ల కోర్సు సరిపోతుంది. మీరు పీజీలో మీకిష్టమయిన బ్రాంచ్ ను ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్ లో జాయిన్ అయ్యేవారు తప్ప మిగిలిన వారు మంచి కాలేజీల్లోనే ఈ కోర్సులు చేస్తే బాగుంటుంది. మ్యాధ్స్, ఫిజిక్స్ తో ఈ కోర్సులు చేసే వారు జాయిన్ అవ్వవచ్చు.ఏదైమయినా కాలేజీని బట్టి కోర్సు బాగుంటుంది. అందువలన ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసేవారు కాలేజీల్లో ఈ కోర్సుల గురించి వాకబు చేసి జాయిన్ అయితే మేలు. విదేశాల్లో రీసెర్చ్ చేద్దామనుకుంటే ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ కోర్సులు చేస్తే మంచిది.విద్యార్దులు ఈ కోర్సులకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.

Exit mobile version