Site icon Prime9

Postal jobs: తపాలా శాఖలో 40 వేల పోస్టులు.. రేపటితో ముగుస్తున్న గడువు

indian post

indian post

Postal jobs: తపాలా శాఖలో 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక చేసే ఈ ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వరకు అవకాశం కల్పించారు.

40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. (Postal jobs)

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఒక్కరోజే మిగిలి ఉంది. పదో తరగతి అర్హతతో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి గత నెల 27 నుంచి తపాలాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకు సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు.. https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

తపాలా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏపీలో 2480 పోస్టులు ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 1266 పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు గడువు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చారు. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆయా సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ ఆధారపడి ఉంటుంది. రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాల్సి ఉంటుంది.

 

ఈ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష లేదు. మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లంలో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో టెన్త్ పాస్ అయి ఉండాలి.

Exit mobile version