Site icon Prime9

India Post Recruitment 2022: ఎనిమిదవ తరగతి పాస్ అయ్యారా.. ఐతే ఈ ఉద్యోగాలు మీ కోసమే!

india post prime9news

india post prime9news

India Post Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన వారు ఇండియా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. భారత తపాలా శాఖ నుండి కేవలం 8వ తరగతి అర్హతతో గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంభందించినది కాబట్టి ఏపీ, తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే రాతపరీక్షలు లేకుండానే భర్తీ చేయనున్నారని తెలుస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల ఖాళీలు: 5
ఎంవీ మెకానిక్ ఖాళీలు – 02
ఎంవీ ఎలక్ట్రిషియన్ ఖాళీలు – 01
పెయింటర్ ఖాళీలు – 01
టైర్మెన్ ఖాళీలు – 01

అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం రాతపరీక్ష లేకుండానే ట్రేడ్ టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ 100/-
మిగితా అభ్యర్ధులు ఉచితంగా అప్లై చేసుకోవాలి.
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తులు ప్రారంభ తేది: సెప్టెంబర్ 19, 2022 నుంచి అక్టోబర్ 17, 2022 వరకు అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Exit mobile version