Site icon Prime9

IIIT Bengaluru: IIIT హైదరాబాద్ తో పోలిస్తే IIIT బెంగళూరు ఎందుకంత ప్రత్యేకం

IIIT Bengaluru

IIIT Bengaluru

IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు. అసలు  iiit బెంగళూరులో విద్యనభ్యసించడం వల్ల కలిగే లాభాలేంటి.. iiitహైదరాబాద్ తో పోలిస్తే iiitబెంగళూరు బ్రాంచ్ ఎందుకుంత ప్రత్యేకమనేది డాక్టర్ సతీష్ గారి మాటల్లో తెలుసుకుందాం.

ఇంటిగ్రేటెడ్ మెంటెక్ ప్రత్యేకం (IIIT Bengaluru)

విస్తీరణం పరంగా క్యాంపస్ పరంగా విద్యార్థుల జాయినింగ్స్ పరంగా రెండు బ్రాంచులు ఒకటే అయినా బెంగళూరు iiitకి మాత్రం ప్రత్యేకం. ఐదేళ్ల కాలపరిమితితో ఇంటిగ్రేటెడ్ మెంటెక్ అంటే నాలుగేళ్ల బీటెక్ ఒక సంవత్సరం కేవలం ప్రాజెక్ట్ మాత్రమే చేసేలా బెంగళూరు బ్రాంచ్ లో ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ డ్యుయల్ స్పెషలైజేషన్స్ కి ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇక్కడ కేవలం ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్ రెండు కోర్సులు మాత్రమే అందిస్తుంది.

ఇక్కడ ఫీజులు విషయానికి వస్తే సెమిస్టర్ కి రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులు ప్యూర్ మెరిట్ ఆధారంగా జాయిన్ అవుతారు. ఇక్కడ మరో ఎడ్వాన్టేజ్ ఏంటంటే ఇంటర్న్ ఫిష్ లోనే రూ. 50 నుంచి రూ. 60 వేల రూపాయలు విద్యార్థులు సంపాధిస్తారు. ఇక్కడ స్కాలర్స్ ఫిష్ ఉంటుంది. కూడా జేఈఈ టాప్ 5 ర్యాంకు విద్యార్థులకు ఈ కళాశాలలో ఫీజు అంతా పూర్తి ఉచితం.

ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.

Exit mobile version