ICAI CA Foundation Result: గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ (సీఏ) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండయా (ICAI)ఈ ఫలితాలను వెల్లడించింది. ICAI వెబ్ సైట్ icai.nic.in లో అభ్యర్థులు ఫలితాలను తెలుసుకోవచ్చని సంస్థ పేర్కోంది.
రిజల్ట్ కోసం అభ్యర్థులు 6 డిజిట్స్ రోల్ నెంబర్ తో పాటు రిజిస్ట్రైషన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
2022, డిసెంబర్ 14 నుంచి 20 వ తేదీల వరకు సీఏ పరీక్షలు జరిగాయి.
– అధికారిక వెబ్ సైట్ icai.nic.in లో లాగిన్ అవ్వాలి
– హోం పేజ్ లో ICAI CA foundation Result 2022 పేరుతో ఉన్న్ లింక్ ను క్లిక్ చేయాలి.
– లింక్ చేయగానే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.
– అక్కడ అభ్యర్థుల రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇచ్చి ఫలితాలు చూసుకోవచ్చు.
– ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
– అభ్యర్థులు ఈ లింక్స్ ద్వారా డైరెక్ట్ గా రిజల్డ్ ను చూసుకోవచ్చు ..
https://icai.nic.in/caresult/
https://www.icai.org/
మరో వైపు 2023 మే, జూన్ నెలల్లో జరిగే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ , ఫైనల్ కోర్సుల పరీక్షల షెడ్యూల్ ను ICAI ఇటీవలే ప్రకటించింది.
సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్షలను జూన్ 24,26,28,30 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ కోర్సులో గ్రూప్ 1 పరీక్షలు.. మే 3,6,8,10 తేదీల్లో..
గ్రూపు 2 ను 12,14,16,18 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
ఫైనల్ విద్యార్థులకు గ్రూపు 1 ను మే 2,4,7,9 తేదీల్లో, గ్రూపు 2 ను మే 11,13,15,17 తేదిల్లో జరుగుతాయి.
సంబంధిత వివరాలకు వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/