Prime9

AP High Court Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఏపీలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా..?

Huge Recruitment in AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్, డిగ్రీ, టైపింగ్ సర్టిఫికెట్ ఇలా ఉద్యోగాన్ని బట్టి అర్హత ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. జూన్ 2న దరఖాస్తు గడువు ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్న వారు ఆ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మొత్తం వెకెన్సీల సంఖ్య: 1626

పోస్టులు వారీగా వెకెన్సీలు చూసినట్టయితే..

జూనియర్ అసిస్టెంట్ – 230

ఆఫీస్ సబార్డినేట్ – 651

ప్రాసెస్ సర్వర్ – 164

రికార్డు అసిస్టెంట్ – 24

కాపీయిస్ట్ – 193

ఎగ్జామినర్ – 32

ఫీల్డ్ అసిస్టెంట్ – 56

టైపిస్ట్ – 162

స్టెనోగ్రాఫర్ – 80

డ్రైవర్ – 28

 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: మే 13

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2

 

ఏయే విద్యార్హతలు ఉండాలంటే..

కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండి.. కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఏడో తరగతి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత ఉండాలి

 

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 ఫీజు ఉంటుంది.

 

వయోపరిమితి:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

 

ఉద్యోగ ఎంపిక విధానం:

కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. కొన్ని ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

 

ఏమైనా డౌట్స్ ఉంటే..

కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే.. helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయాలి. లేదా 0863-2372752 నెంబర్ ను అభ్యర్థులు సంప్రదించవచ్చును. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఫోన్ కాల్ అందుబాటులో ఉంటుంది.

Also Read: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు, టెన్త్ పాసైతే చాలు

 

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం పోస్టులు: 1626

దరఖాస్తు ప్రారంభ తేది: మే 13

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2

ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం: ఎగ్జామ్ ద్వారా

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. మరి ఆలస్యం చేయకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

 

Exit mobile version
Skip to toolbar