IIT Madras-Africa Campus: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దలయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) యొక్క క్యాంపస్ లను విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఆఫ్రికాలోని టాంజానియాలో, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ను అబుదాబిలో, ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ ను కౌలాలంపూర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ముందుగా ఈ ఏడాది అంటే 2023 నాటికి ఐఐటీ మద్రాస్ క్యాంపస్ టాంజానియాలోని జంజిబార్ లో బి.టెక్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. దీనిని IIT M ZANZIBAR అంటారు. మరి దీనిలో ప్రవేశం ఎలా పొందాలనేది ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
జూలై 6న నోటిఫికేషన్. ఆగష్టు 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లో 50 సీట్లు ఉంటాయి. ఐఐటీ మద్రాస్ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్దులు 12వ తరగతి మ్యాద్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాసయి ఉండాలి. ఐఐటీ మద్రాస్ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. 20 శాతం మార్కులు దరఖాస్తుకు, 40 శాతం మార్కులు ఎగ్జామ్ కు, ఇంటర్యూకు 20 శాతం మార్కులు ఉంటాయి. పరీక్షలో జనరల్ ఇంగ్టీష్, ఎనలిటికల్ రీజనింగ్, మ్యాధమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఐఐటీ ఎగ్జామ్ కు ఉన్నంత కఠినంగా పేపర్ ఉండదు. బేసిక్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఫలితాలు, ఇంటర్యూలు పూర్తవుతాయి. అక్టోబర్ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఫీజు 10 నుంచి 12 వేల డాలర్లు వరకూ ఉంటుంది. ఐఐటీ మద్రాస్ లో ఉండే ప్లేస్ మెంట్ సెల్ ఇక్కడ కూడా ప్లేస్ మెంట్స్ నిర్వహిస్తుంది. ఇండియాలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు రాని విద్యార్దులు, విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం టెంపరరీ క్యాంపస్ లో తరగతులు ప్రారంభిస్తారు. 2025 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలో తయారయే పెర్మనెంట్ క్యాంపస్ లో తరగతులు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.