DRDO Jobs: రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ (b) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డీఆర్డీవో. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా డీఆర్డీవో పేర్కొంది. ఆసక్తి కలిగిన వాళ్లు https://rac.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ జనరేట్ అయిన నాటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ వెల్లడించింది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆయా పోస్టులను బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ మెకానికల్/ కంప్యూటర్‌సైన్స్/ ఎలక్ట్రికల్/ మెటీరియల్ సైన్స్/ కెమికల్ ఇంజినీరింగ్ ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి. అదే విధంగా వీటిలో కొన్ని ఉద్యోగాలకు ఎమ్మెస్సీ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మేథమెటిక్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారిని కూడా ఎంపిక చేస్తారు. దీంతో పాటు గేట్ స్కోరును కీలకంగా పరిగణిస్తారు.
ఆఖరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఆగస్టు 31 నాటికి వాళ్లు తమ డిగ్రీ/ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 181 పోస్టుల్లో దివ్యాంగులకు 7 పోస్టులను రిజర్వు చేశారు.
ఈ పోస్టులకు భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మెట్రో నగరాల్లో నెలకు దాదాపు రూ. లక్ష వరకు జీతం అందజేస్తారు.
అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 33 ఏళ్లు మించరాదు.