CLAT 2022: “లా” చెయ్యాలనుకుంటున్నారా అయితే అప్లై చేసుకోండి.. “క్లాట్” నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ‘లా’ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి గానూ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే అప్లై చేసుకోండి.

CLAT 2022:  దేశవ్యాప్తంగా ‘లా’ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి గానూ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. వీరితో పాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా ఈ క్లాట్‌ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 13, 2022 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎల్‌యూ సూచించింది. కాగా క్లాట్‌ 2022 ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 18, 2022వ తేదీన పలు పరీక్ష నిర్వహించనున్నారు. క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ అడ్మిషన్లు కల్పిస్తారు. అందులో ప్రథమంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ లఖన్ వూ, పంజాబ్ లాంటి ప్రధాన నగరాలలో 22 ప్రధాన లా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో మొదటగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

జనరల్ అభ్యర్థులు దీని కోసం రూ. 4,000, ఎస్సీ/ఎస్టీ/బీపీఎల్‌ అభ్యర్థులు రూ. 3,500లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. క్లాట్‌-2023 ప్రవేశ పరీక్ష మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలతో ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, కరెంట్ ఆఫైర్స్, లీగల్‌ రీజనింగ్‌, లాజికల్ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: జగన్ సర్కార్ తీపి కబురు.. పోలీస్ శాఖలో 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్