CBSC 12 Results:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12 వ తరగతి ఫలితాలను శుక్రవారం రిలీజ్ చేశారు. సీబీఎస్ఈ బోర్డు ఈ ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in లో సంప్రదించవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ రిజల్ట్ ను పొందవచ్చు.
12 వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
కాగా, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు 12 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది 87. 33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణత తో (92.71 శాతం) పోలిస్తే ఈ ఏడాది 5. 38 శాతం ఉత్తీర్ణత తగ్గిందని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. మరో వైపు గత ఏడాది మాదిరి లాగే ఈ సారి కూడా మెరిట్ లిస్ట్‌ను ప్రకటించడం లేదని బోర్డు అధికారులు వెల్లడించారు.
అయితే, ప్రతి సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన 0.1 శాతం విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఓవరాల్ గా 1,12,838 మంది విద్యార్థులు 90 శాతం కంటే అధిక మార్కులు సాధించారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.91 శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 78.05 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరో వైపు సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వ తేదీ వరకు జరిగాయి. 10 వ తరగతి ఫలితాలను బోర్డు ప్రకటించాల్సి ఉంది.