Site icon Prime9

Demand Of CSE Course: సీఎస్ఈ కోర్స్ కు ఎందుకంత డిమాండ్.. CSEకి ఇతర కోర్సులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి?

Demand Of CSE Course

Demand Of CSE Course

Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు. మరి అసలు సీఎస్ఈ చేసి ఏఏ ఉద్యోగాల్లో చేరవచ్చు.. అసలు కంప్యూటర్ సైన్స్ ఎందుకంత డిమాండ్ దీన్ని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకోవాలి ఎలాంటి కళాశాల్లో ఈ కోర్సు చదివితే బాగుంటుందో డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

CSEకి ఇతర కోర్సులకు ఉన్న డిఫరెన్స్(Demand Of CSE Course)

ప్రోగ్రామింగ్ లాంగ్వేజిలు ఎక్కువ అవ్వడం టెక్నాలజీ వాడకం మరింత పెరగడం వల్ల ఐటీ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అవసరం ఏర్పడింది. కంప్యూటర్ సైన్స్ అనేది టూల్స్ ని ఇస్తే ఐటీ అనేది కంప్యూటర్లో ఏ టూల్ ని ఏ సమస్యలను పరిష్కరించడంలో వాడాలి అనే దానికి తోడ్పడుతుంది. ఇలా ఐటీ మరియు కంప్యూటర్ సైన్స్ ఒకదానికి ఒకటి అనుబంధమై ఉన్నాయి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మరియు డేటా సైన్స్ అనే కోర్సులు కూడా ఇటీవల కాలంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏఐ అంటే కంప్యూటర్ అనేది మనిషిలా థింక్ చేసి మనిషి ఇచ్చిన ఇన్ ఫుట్స్ తో సమాధానం చెప్పేలా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. డేటా సైన్స్ అంటే ఒక డేటాను తన దగ్గర పెట్టుకుని ఒక వస్తువును ఎలా మార్కెట్లో విక్రయించాలనే దానికి ఉపయోగిస్తారు. ఇలా ఈ కోర్సులన్నింటికి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వీటిలో ఏ కోర్సులో చేరాలో తెలుసుకుందాం.

కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థి ఎలక్టివ్స్ లేదా మైనర్ తీసుకోవడం ద్వారా  ఇతర ఏ కోర్సు అయినా చదివే అవకాశం ఉంటుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖచ్చితంగా గేట్ ఎగ్జామ్ రాయాలి.. ఆ గేట్ ఎగ్జామ్ లో కేవలం కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉంటుంది. అందుకే సీఎస్ఈ అనేది ఇండియాలో చాలా ప్రిఫరబుల్ అని డాక్టర్ సతీష్ చెబుతున్నారు.

అంతే కాకుండా ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సీఎస్ఈ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి.. గేట్,  జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.

Exit mobile version