Site icon Prime9

Bank of Baroda Jobs 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్

bank of baroda prime9news

bank of baroda prime9news

Bank of Baroda Jobs: బ్యాంకు ఉద్యోగాలు చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా  పలు ఖాళీల పోస్టుల భర్తీకి  జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ని కోరుతూ  బ్యాంక్  ఆఫ్ బరోడా  నోటిఫికేషన్స్ విడుదల చేసింది. మొత్తం 346  ఖాళీలు వాటిలో ఈ విభాగాల్లో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్), ఆపరేషన్స్ హెడ్-వెల్త్ లాంటి పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అప్లై  చేయడానికి  2022 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ధరఖాస్తు విధానం తెలుసుకుందాం.

కావలిసిన అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాస్ కావాలి. MBA ,మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు అనుభవం కూడా ఉండాలి.

ధరఖాస్తు వివరాలు..

దరఖాస్తుకు అప్లై చేసుకునే చివరి తేదీ- 20 అక్టోబర్ 2022.
వయస్సు – 24 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
దరఖాస్తు ఫీజు- జనరల్, OBC అభ్యర్థులకు రూ.600.SC,ST వికలాంగులకు రూ.100 ఉంటుంది.
వేతనం- విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుంది.

ఇదీ  చదవండి :  హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగాలు .. వెంటనే అప్లై చేసుకోండి !

Exit mobile version