Site icon Prime9

AP Polycet 2023 : ఏపీ పాలిసెట్‌ 2023 ఫలితాలు రిలీజ్..

AP Polycet 2023 exam results out now

AP Polycet 2023 exam results out now

AP Polycet 2023 : ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన “పాలిసెట్-2023” ఫలితాలు తాజాగా విడుదల చేశారు. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను రిలీజ్ విడుదల చేయడం జరిగింది. కాగా ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కుల వచ్చాయి. విశాఖపట్టణానికి చెందిన విద్యార్థి మొదటి స్థానంలో నిలిచాడు.

పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారు. ఇక పాలీసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.

డిప్లొమా కోర్సులు..

సివిల్

మెకానికల్

ఆటోమొబైల్

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్

ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్

కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

మెటలర్జికల్

కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version