Site icon Prime9

AP Inter Hall Tickets: వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

AP Intermediate Hall Tickets 2025 on WhatsApp: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌కు ‘మనమిత్ర’ పేరుతో ప్రజలతో పాటు విద్యార్థులకు అవసరమైన సమాచారం అందేలా అడుగులు వేసింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియన్ పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్లను సైతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో పాటు వెబ్‌సైట్ ఆధారంగా కూడా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ను సంప్రదించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా వాట్సాప్ నంబర్ 9552300009 తో కూడా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే గతంలో పలు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశారు. హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని బెదిరింపులకు సైతం పాల్పడ్డాయి. ఈ సమస్యలకు చెక్ పడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక, విద్యార్థులు నేరుగా తమ వాట్సాప్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వం ఇచ్చిన మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు HI అని మెసేజ్ చేయగా.. సేవలను ఎంచుకునే ఆప్షన్ డిస్ ప్లే‌లో కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే.. మరిన్ని సేవలు కనిపిస్తాయి. ఇందులో విద్య సేవలపై క్లిక్ చేసిన తర్వాత పరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్‌పై ఫస్టియర్, సెకెండియన్ పరీక్షల హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఆప్షన్ వస్తుంది. ఇందులో అవసరమైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత రూల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఫోన్‌లోనే హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతోంది.

ఇక, ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయా. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ఉండగా.. మార్చి 3వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

Exit mobile version
Skip to toolbar