Site icon Prime9

AP Inter Results Out Now: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్!

AP Intermediate First and Second Year Results 2025 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10లక్షలమందికి పైగా పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది.

 

పరీక్ష రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకునేందుకు అవకాశం కల్పించారు.  ఈ వెబ్ సైట్ క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్, సెకండియర్ జనరల్ రిజల్ట్స్, సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత వాటిపై అభ్యర్థులు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని అక్కడ కనిపించే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా,  ఈ ఏడాది కూటమి సర్కార్ కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సులువుగా ఇబ్బందులు లేకుండా రిజల్ట్స్ తెలుసుకునేందుకు 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసెజ్ పంపించి ఫలితాలు చూడవచ్చు.

 

ఇదిలా ఉండగా, సెకండియర్ పరీక్షల్లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా 93 శాతం నిలవగా.. చివరి స్థానాల్లో అల్లూరి, అనకాపల్లి జిల్లాలలో 73 శాతం నమోదయ్యాయి. ఇక, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు ప్రభంజనం సృష్టించాయి. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వృద్ధి చెందాయని, ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 69 శాతానికి చేరిందన్నారు. గత పదేళ్లలో ఇదే అత్యధికమని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు, లెక్చరర్ల కృషికి ఈ విజయం నిదర్శమని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ తెలిపారు. అలాగే ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరాశ చెందవద్దని, మరింత కృషి చేసి బలంగా తిరిగి రావాలని సూచించారు.

 

Exit mobile version
Skip to toolbar