Site icon Prime9

AP EAPCET Results 2023 : ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు రిలీజ్..

ap-eapcet-results-2023 announced by minister botsa sathyanarayana

ap-eapcet-results-2023 announced by minister botsa sathyanarayana

AP EAPCET Results 2023 : ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్‌ను గత నెల 15 నుంచి 24 వరకు నిర్వహించారు. వీటిలో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ  అడ్మిషన్‌లను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది.. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

కాగా ఇంజనీరింగ్ లో 76.32 శాతం.. అగ్రికల్చర్ కోర్సుల్లో 89.65 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఉమేష్ వరుణ్ ఫస్ట్ ర్యాంకు సాధించగా.. తెలంగాణ ఎంసెట్ లో కూడ ఉమేష్ వరుణ్ మూడో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్ లో నీట్‌ టాపర్‌గా  నిలిచిన వరుణ్‌కు రెండో ర్యాంక్‌ లభించింది.

ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు (AP EAPCET Results 2023).. 

  1. చల్లా ఉమేష్ వరుణ్- 158  మార్కులు
  2. అభినవ్ చౌదరి- 157 మార్కులు
  3. నండిపాటి  సాయి దుర్గా రెడ్డి -155 మార్కులు
  4. తపాటి  బాబు  సృజన్‌  రెడ్డి- 155మార్కులు
  5. దుగ్గినేని  వెంకట  యోగేష్- 150 మార్కులు
  6. అడగడ్డ  వెంకట  శివరాం  – 153 మార్కులు
  7. ఎక్కింటి  ఫణి  వెంకట  మనిచంద్రా  రెడ్డి 153 మార్కులు
  8. మెడపురం  లక్ష్మి  నరసింహ  భరద్వాజ్ 153 మార్కులు
  9. శశాంక్  రెడ్డి- 152 మార్కులు
  10. ఎం శ్రీకాంత్- 152 మార్కులు

(AP EAPCET Results 2023) అగ్రికల్చర్ విభాగంలో ర్యాంకర్లు.. 

  1. సత్యరాజు జశ్వంత్ (ప్రథమ ర్యాంక్)
  2. వరుణ్ చక్రవర్తి( రెండో ర్యాంకు)
  3. రాజ్ కుమార్ (మూడో ర్యాంక్)
  4. సాయి అభినవ్ (నాలుగో ర్యాంక్)
  5. కార్తికేయ రెడ్డి(ఐదో ర్యాంక్)

 

Exit mobile version