AP 10th Results 2023 : పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..

ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 11:58 AM IST

AP 10th Results 2023 : ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఫలితాలను విడుదల చేసి.. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఫలితాలను విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలానే దీంతోపాటు ప్రైమ్ 9 వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు.

 

https://www.bse.ap.gov.in/

http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp#