CUET UG: కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశాలు.. మిస్ అవ్వకండి

CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.

CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించనుంది.
వివరాలు…

పరీక్ష విధానం ఇలా ఉంటుంది.. (CUET UG)

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇక ఈ పరీక్షను.. పదుమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్ష ద్వారా జేఎన్టీయూ, హెచ్ సీయూ, ఇగ్నో, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు.

పరీక్ష విధానం

మూడు సెక్షన్లుగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మొదటి సెక్షన్‌ (1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో.. రెండో సెక్షన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్టులో, మూడో సెక్షన్‌ జనరల్‌ టెస్ట్‌లో మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. అంటే నెగెటివ్ మార్కు ఉంటుందని అర్ధం. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండో సెక్షన్‌లో 45/50 ప్రశ్నలకు గానూ 35/40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్‌ ఆధారంగా నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి.. రుసులు ఇలా ఉంటుంది

జనరల్ అభ్యర్ధులు.. మూడు సబ్జెక్టులకు రూ.750.. ఏడు సబ్జెక్టులకు రూ.1500.. పది సబ్జెక్టులకు రూ.1750 చొప్పున చెల్లించాలి. ఓబీసీ అభ్యర్ధులు మూడు సబ్జెక్టులకు రూ.700.. ఏడు సబ్జెక్టులకు రూ.1400.. పది సబ్జెక్టులకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జెండర్‌- మూడు సబ్జెక్టులకు రూ.650.. ఏడు సబ్జెక్టులకు రూ.1300.. పది సబ్జెక్టులకు రూ.1550 చెల్లించాలి.

తెలంగాణ, ఏపీలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఏపీలో పరీక్ష కేంద్రాలు.. అమరావతి, అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్. మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12-03-2023.

రుసుము చెల్లింపు చివరి తేదీ: 12-03-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 15 నుంచి 18-03-2023 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 30-04-2023.

అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2023.

పరీక్ష తేదీలు: 21-05-2023 నుంచి ప్రారంభం.