Site icon Prime9

Vijayawada Durga Temple: వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

vijayawada temple prime9news

vijayawada temple prime9news

Vijayawada Durga Temple: దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది.దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి
వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా ముందు వెల్లడించారు.శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే దివ్యాంగులు,వృద్ధులకు నేటి నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఉదయం 10:00 గంటలు నుండి 12:00 గంటలు వరకు,సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.అందులో భాగంగానే విజయవాడలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి వారిని ప్రత్యేక బస్సులలో తీసుకుని వెళ్లి అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ వారున్న చోటుకు తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు.

దీని కోసం వారు ఎలాంటి డబ్బులు చెల్లించాలిసిన అవసరం లేదని అలాగే వృద్ధులు,దివ్యాంగులకు ఎలాంటి టికెట్స్ కొనాల్సిన అవసరం లేకుండా దర్శనం చేసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు.అక్టోబర్ 2వ తేదీ మూలా నక్షత్రం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు ఈ ఉచిత దర్శనం అందుబాటులో ఉంటుందని..అలాగే వయో వృద్ధులు, దివ్యాంగులైన భక్తులు ఈ ఉచిత సేవను వినియోగించుకోవాల్సిందిగా మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Exit mobile version