Site icon Prime9

Tirumala: తిరుమలలో హనుమత్ జయంతి ఉత్పవాలు.. ఘనంగా ఏర్పాట్లు

tirumala

tirumala

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతూ ఉంటుంది. నిత్యం ప్రత్యేక వేడుకలు.. ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో మే 14 వ తేదీ నుంచి 18 తేదీ వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు జరిగే ఉత్పవాలను జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

పండితులతో ప్రత్యేక ప్రసంగాలు(Tirumala)

ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు హనుమంతుని జన్మ విశేషాలతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా వేద పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే విధంగా తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణంతో పాటు యాగం నిర్వహించాలన్నారు. అందుకోసం పండితులను ఆవ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృలా వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.

 

నిరంతరాయంగా అఖండ పారాయణం(Tirumala)

మే 16న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా అఖండ పారాయణం కొనసాగుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితులు సమూహంగా పటిస్తారని ఆయన తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజూ అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్ డీపీపీ ప్రాజెక్టు కళాకారులతో భక్తి, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే అతిథులకు వసతి, రవాణా, దర్శనం లాంటి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.

Exit mobile version