Site icon Prime9

Diamond Ganesh: గణపతి ఆకారంలో రూ.500 కోట్ల వజ్రం

diamond ganesha

Gujarat: సూరత్‌లోని కతర్గామ్ ప్రాంతంలో గణపతి ఆకారంలో ఉన్న వజ్రం ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి అట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 కోట్ల రూపాయల విలువైన ఈ 27 క్యారెట్ల వజ్రాన్ని 16 సంవత్సరాల క్రితం పాండవ్ కుటుంబీకులు కనుగొన్నారు. మరియు ప్రతి సంవత్సరం 10 రోజుల పండుగ సందర్భంగా పూజ కోసం బయటకు తీసుకువస్తారు. ఈ ఏడాది కూడా విగ్రహం లాంటి వజ్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

సూరత్‌లో వజ్రాల బ్రోకర్ వద్ద పని చేస్తున్నప్పుడు ఈ గణేశ విగ్రహాన్ని కనుగొన్నారు. దీనితో ఆ కుటుంబం దానిని తమవద్దే ఉంచుకోవాలని, విక్రయించకూడదని నిర్ణయించుకుంది. ఈ కుటుంబసభ్యులు ఏటా గణేష్ చతుర్థి రోజున దాన్ని బయటకు తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. ఈ వజ్రాన్ని డైమండ్స్ ఆఫ్ ఇండియా వారు పరీక్షించి సహజంగా సంభవించినట్లు గుర్తించారు. ఈ వజ్రం విలువ రూ.500 కోట్లు ఉంటుందని పాండవ్మ కుటుంబీకులు తెలిపారు. గణేష్ చతుర్థి యొక్క 10 రోజులు ముగిసిన తర్వాత, కుటుంబం పాలతో వజ్రాన్ని కడిగి, దానిని తిరిగి లాకర్‌లో ఉంచుతారు.

Exit mobile version