Site icon Prime9

TTD: ఈ నెల 11న డిసెంబర్ నెల రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.. టీటీడి

On 11th of this month Rs. 300 special darshan tickets released for the month of December...TTD

Tirumala: భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్ధానం అనేక వెసులుబాటులు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే భక్తులకు ముందస్తుగా వెంకటేశ్వర స్వామి వారి దర్శన సౌకర్యం పొందేలా నిత్యం టిటిడి ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టిక్కెట్లను పొందవచ్చని పేర్కొనింది.

తిరుమలలో వేంచేసివున్నా కలియుగ వెంకన్న స్వామి వారి దర్శన భాగ్యాన్ని భక్తుల దరిచేర్చేందుకు టిటిడి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. భక్తుల రద్ధీకి అనుగుణంగా సర్వదర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలతోపాటు పలు సేవలను నేరుగా భక్తులు పొందేలా చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆయా సేవలకు సంబంధించిన ఖాళీలను గుర్తించడం, అనంతరం ఎలాంటి అసౌకర్యానికి గురౌకుండా భక్తులు తిరుమలకు చేరుకొనేలా తగిన ఏర్పాట్లలో భాగంగా భక్తుల కోటా వివరాలను టిటిడి ఎప్పటికప్పుడు తెలియచేస్తోంది.

ఇది కూడా చదవండి: Lunar Eclipse: చంద్ర గ్రహణం వీడింది

Exit mobile version