Site icon Prime9

ఉజ్జయిని: మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి 10 రోజులపాటు ప్రవేశం లేదు.. ఎందుకంటే..?

Ujjain

Ujjain

Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. సంవత్సరాంతంలో మరియు కొత్త సంవత్సరం ప్రారంభంలో ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, గర్భగుడిలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్, . ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఆశిష్ సింగ్ తెలిపారు.

అయితే ‘దర్శనం’ కోసం అదనపు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 20 నుంచి ఆలయ ప్రాంగణంలోకి సందర్శకులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని కమిటీ ఇప్పటికే నిషేధించిందని అధికారులు తెలిపారు.దేశంలోని 12 ‘జ్యోతిర్లింగాలలో’ ఒకటై ఉజ్జయిని మహాకాళేశ్వరాలయానికి ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

Exit mobile version