Site icon Prime9

Rajanna Sircilla: ఒకప్పటి కోనేరు ఇప్పుడు మురికి కోనేరుగా పోయింది

Rajanna Sircilla: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు వల్ల అక్కడ ఉన్న భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో , చెత్త చేదారాల వల్ల భక్తులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ కోనేరులో చెత్త, మురుగు నీటితో నిండిపోయి ఉంది. గతంలో స్వామి వారి దర్శనానికి ముందు కోనేరులో స్నానం చేసి భక్తులు. దర్శనానికి వెళ్ళే వారు. ప్రస్తుతం కోనేరు పరిస్థితి చూసి అటు వైపు కూడా ఎవరు వెళ్లడం లేదు. అది చూడ్డానికి కూడా ఎవరు ఇష్ట పడటం లేదు. చెత్తాచెదారంతో నిండిపోయిన కోనేరును ఎవరు కూడా పట్టించు కోవడం లేదు. పట్టించుకునే నాధుడే కరువయ్యారని నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల అందరికి నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం అది ఒక ఆనవాయితీగా వస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ధర్మగుండంగానీ, కోనేరులో గాని పుణ్యస్మానాలు ఆచరిస్తే రోగాలు మన దరిచేరవని భక్తులు నమ్ముతారు. కోనేటి స్నానం తర్వాతే స్వామివారిని ఆచారం ప్రకారం దర్శించుకుంటారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి వారు పెరుమాల్లుగా నాంపల్లి గుట్టపై కొలువై ఉన్నారు. భక్తులు కూడా ఎక్కువుగా ఉంటారు. ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు . స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గొప్ప పర్యాటక కేంద్రంగానూ ఈ ప్రాంతం పేరుగాంచింది. ఐతే ఆలయం తీరు సరిగా లేకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి కోనేరులో నీరు పూర్తిగా పచ్చగా మారిపోయాయి. అది తాకితేనే రోగాలు వస్తాయోమో ? అన్నంతలా మురికి పేరుకుపోయింది. వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు స్పందించి కోనేరును శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

Exit mobile version