Ttd: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా?

Ttd: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి భక్తులు ఎన్ని గంటలైనా బారులు తీరుతారు. అలాంటి భక్తులకు ఉపయోగపడేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవలోనే  భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి తిరుమలలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను విడుదల చేయనుంది. వీటికి సంబంధించి దర్శన కోటా టికెట్లను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

అందుబాటులో వర్చువల్ టికెట్లు

అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ.. అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండదు. కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలని ఆలయ అధికారులు కోరారు. ద‌ర్శ‌న టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల‌ని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి కోరారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని.. వర్చువల్ సేవా టికెట్లను ఉపయోగించుకోని శ్రీవారి సేవలను పొందాలని సూచించారు.

ఈ ఏడాది ఊంజల సేవ కమణీయంగా జరగనుంది. తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవము తర్వాత గృహస్తుల కోరికపై అద్దాల మహలుకు వేంచేస్తారు. ఈ మండపం మధ్యలో వున్న డోలలో స్వామి వారికి ఉభయ దేవేరులతో డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మండపంలో అన్ని వైపుల వున్న అద్దాలలో స్వామి వారు కనిపిస్తూ భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తారు. అనంతరం కర్పూర నీరాజనము, ప్రసాదా వితరణ జరుగుతుంది. ఈ వేడుక కన్నుల పండువగా జరగనుంది.

ఇవి కూడా చదవండి:

ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్

‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/