Site icon Prime9

Ram Janmbhoomi temple: 2024 సంక్రాంతికి.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం?

Ayodhya Ram Mandir set to welcome devotees in 2024

Ayodhya Ram Mandir set to welcome devotees in 2024

Ayodhya: 2024లో రామ భక్తులను స్వాగతించేందుకు అయోధ్య రామమందిరం సిద్ధమైంది. జనవరిలో సంక్రాంతికి రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం ఆలయంలోకి భక్తుల సందర్శనానికి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.

1800కోట్ల విరాళాలతో తలపెట్టిన రామ మందిర నిర్మాణ పనుులు 50 శాతం పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధం అవుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో పలు హిందూ దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించిన్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: TTD: వృద్ధులు, దివ్యాంగ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తితిదే

Exit mobile version