Site icon Prime9

Young Man Suicide : ఏపీలో దారుణం… లవర్ మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న యువకుడు… సెల్ఫీ వీడియో తీసుకుంటూ

young-man-suicide-in ap and selfie video goes viral

young-man-suicide-in ap and selfie video goes viral

Young Man Suicide : రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ఇంకా ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది మృగాళ్ల చేతిలో మహిళలు బలి అవుతున్నారు. అయితే మరోవైపు గత కొన్నేళ్లుగా గమనిస్తే ఆడవారిలో కూడా కొంత మంది మోసగత్తెలు మగాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడవారికి అండగా మహిళ సంఘాలు, చట్టాలు ఉన్నాయి , మరి మగవారి పరిస్థితి ఏంటి అని కొంత మంది భగ్న ప్రేమికులు రోధిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా కొంత మంది యువతులు ప్రేమ పేరుతో యువకులను వారి అవసరాలకు వాడుకుంటూ అవసరం తీరాక వారిని మోసం చేస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు.

తాజాగా ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియురాలు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ యువకుడు నిండు ప్రాణాన్ని తీసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. చనిపోయే ముందు తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఆ యువకుడి చివరి మాటలు అందరితో కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. జిల్లా లోని పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో సుంకన్న, రమణమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు కర్నూలు లోని బంధువుల ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంతలో ఆ అమ్మాయి అతన్ని మోసం చేస్తూ వేరే వ్యక్తితో ఉందని ఆంజనేయులుకు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు లక్ష్మాపురం వెళ్లాడు. అనంతరం తండ్రితో కలిసి పంట పొలానికి వెళ్లి కొంత సమయం గడిపాక… ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా… అతను రాకపోగా, అతని చావు వార్త ఓ సెల్ఫీ వీడియో రూపంలో వచ్చింది.

ఆ వీడియోలో తాను ప్రేమించిన అమ్మాయి తనతో ఉంటూనే  వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను ఎంతో ప్రేమించానని, ఆమె లేని జీవితం తనకు వద్దన్నాడు. తనకు ఆ యువతి వేరే వ్యక్తితో ఉన్న వీడియోలు, ఫోటోలు పంపించిందని అవి చూసి మరింత బాధ కలిగిందన్నాడు. తల్లిదండ్రులు తనను క్షమించాలని, ఇక తనను తల్లిదండ్రులు మరిచిపోవాలని చెప్పాడు. ఇద్దరు చెల్లెళ్లను బాగా చూసుకోవాలని, ఉన్న పొలాన్ని ఇద్దరికి సమానంగా పంచాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ద్వారా అతను ఉన్న ప్రాంతానికి వెళ్ళిన వారికి ఆంజనేయులు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడ్ని కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి మోసగత్తె లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version