YCP Leader Murder: అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో దారుణం జరిగింది. శ్రీవారినగర్‌కు చెందిన వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి (25 ) అలియాస్ శేషు ను దుండగులు కిరాతకంగా హతమార్చారు. అర్ధరాత్రి 10 మందికి పైగా గేటు తాళాలు పగలగొట్టి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి భార్య కళ్లముందే అతనిపై వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో శేషు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది . స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు . మృతదేహాన్ని పరిశీలించి శవ పరీక్షకోసం మదనపల్లి జిల్లాప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ ఘటనా స్థలంలో పరిశీలించారుదీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నక్రమంలో హత్యకు సంబంధించిన నిందితులు లోగిపోయారు.
లొంగిపోయిన నిందితులు..(YCP Leader Murder)
ఈ హత్య కేసులో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఓ ఇన్నోవా వాహనంతో సహా మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శేషాద్రి హత్యలో బహుజన సంఘం నేత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య పార్టీల పరంగా ఆదిపత్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది . అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల విషయంలో వివాదం, భూ ఆక్రమణలు, కబ్జాల్లో సైతం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తన భర్త హత్య ఘటనలో పది మందికి పైగా ఉన్నట్లు భార్య చెబుతుండగా.. మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.