Site icon Prime9

Mobile phone Recover: డ్యామ్ లో పడిపోయిన మొబైల్ ఫోన్ కోసం రైతుల పొలాలకు వెళ్లే గ్యాలన్ల కొద్దీ నీరు తోడేసారు.. ఎక్కడో తెలుసా?

Mobile phone

Mobile phone

Mobile phone Recover: ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ అధికారి తన మొబైల్‌ను డ్యామ్ లో పడిపోవడంతో దానిని తీసుకోవడానికి పొలాలకు ఉద్దేశించిన మిలియన్ల గ్యాలన్ల నీరు డ్యామ్ నుంచి తోడించాడు. దీనికి సంబంధించి వివరాలివి.

ఛత్తీస్‌గఢ్‌ కోయలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ తన సెలవు దినాన ఖేర్‌కట్టా పర్‌కోట్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా రూ. 96,000 విలువైన అతని Samsung S23 ఫోన్‌ని 15 అడుగుల లోతున్న నీటిలో పడిపోయింది. దీనితో విశ్వాస్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి చేరుకుని నీటిలో మునిగిన తన ఫోన్‌ను తిరిగి పొందే మార్గాలపై చర్చించారు. చివరికి, రిజర్వాయర్ నుంచి నీటిని బయటకు తోడాలని నిర్ణయించి దీనికోసం 30-హార్స్‌పవర్ పంప్‌ని మోహరించారు, ఫలితంగా రైతల పొలాల కోసం ఉంచిన నిల్వ నీటిని విడుదల చేశారు.

1,500 ఎకరాల భూమికి సాగునీరు అందించవచ్చు..(Mobile phone Recover)

ఒక్కరోజులో ఇరవై ఒక్క లక్షల లీటర్ల నీరు బయటకు పోయింది. మిషన్ మొబైల్ ఖోజో’ పూర్తిగా మూడు రోజులు కొనసాగింది.మిలియన్ల గ్యాలన్ల నీటిని విడుదల చేసిన మూడు రోజుల తర్వాత ఫోన్ తిరిగి పొందగలిగారు. దీనికోసం సుమారు 1,500 ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ఉపయోగపడే నీటిని తోడేసారు. మరోవైపు మూడు రోజుల ఆరబెట్టిన తర్వాత కూడా విశ్వాస్ ఫోన్ పని చేసే స్థితిలో లేకపోవడం గమనార్హం. అప్పటికి డ్యాంలో నీటిమట్టం 10 అడుగుల మేర పడిపోయింది.

సాగుకు పనికిరాని నీరు..

అయితే డ్యామ్ నుంచి తోడేసిన నీరు సాగుకు పనికిరాదని మురుగునీరని రాజేష్ విశ్వాస్ చెప్పారు. తన వ్యక్తిగత మొబైల్లో ముఖ్యమైన కాంటాక్ట్స్ ఉన్నందున రికవరీ కోసం ప్రయత్నం చేశామని చెప్పారు.3-4 అడుగుల నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ఎస్డీవో ద్వారా మౌఖిక అనుమతి తీసుకున్నామని అన్నారు. డీజిల్ పంపుతో నీరు తోడటానికి అయిన ఖర్చు రూ.7,000-8,000 వరకు ఉంటుందని అన్నారు. నా చర్య వల్ల ఏ రైతు కూడా నష్టపోలేదని విశ్వాస్ అన్నారు.జలవనరుల శాఖ డిప్యూటీ అధికారి రామ్‌లాల్ ధీవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు అడుగుల లోతు వరకు నీటిని తోడేందుకు మౌఖిక అనుమతి లభించింది. అయితే ఇప్పటి వరకు 10 అడుగులకు పైగా నీటిమట్టం తగ్గింది.అధికారులు నీటిపారుదలపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు మరియు కోల్పోయిన నీటికి పరిహారం అందించే చర్యలను పరిశీలిస్తున్నారు.

Exit mobile version