Site icon Prime9

YSR district: వైఎస్సాఆర్ జిల్లాలో దొంగలు హల్ చల్

Thieves in YSR district

Thieves in YSR district

Chakrayapet: వైఎస్సాఆర్ జిల్లా చక్రాయపేటలో దొంగలు హల్ చల్ చేసారు. స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న ఓ దుకాణాన్ని లూటీ చేసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. శబ్ధాలకు స్థానికులు అప్రమత్తమైనారు. ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొంగలు పరుగులు పెట్టారు. ఇదంతా సీసీ టీవీలో రికార్డు కావడంతో వ్యవహారం బయటపడింది.

సమాచారంమేరకు గుర్తు తెలియని ముగ్గురు యువకులు రాత్రి సమయంలో స్టేట్ బాంకు వీధిలోకి బైకుపై వచ్చారు. బ్యాంకు ఎదురుగా ఉన్న దుకాణంలోకి ఇద్దరు దొంగలు లోపలకు వెళ్లారు. వారితో పాటు బైకుపై వచ్చిన మరో యువకుడు మాత్రం కాపాలాగా గేటు బయటే ఉండిపోయాడు. తాళాలు పగొలగొట్టి దుకాణంలోకి ప్రవేశించేందుకు అంతా సిద్దం చేసుకొన్నారు. ఆ శబ్ధాలకు ఇరుగు పొరుగు వారు ఎవరా అంటూ ప్రశ్నించడంతో దొంగలు అక్కడ నుండి పలాయనం చిత్తగించారు.

24గంటల పాటు బ్యాంకు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. పోలీసుల పహారా కూడా రాత్రి వేళల్లో ఉంటుంది. అయిన్నప్పటికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. వారంతా పకడ్భందీగా దొంగతనానికి వచ్చారా? లేదా ఇతర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Exit mobile version