Uttar Pradesh: యూపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. బాలికలను లైంగికంగా వేధించాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 18 మందిబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రభుత్వ స్కూల్ టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దారుణం..
యూపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. బాలికలను లైంగికంగా వేధించాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 18 మందిబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రభుత్వ స్కూల్ టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఈ ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ 18మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు నిర్దారించారు. విద్యార్థినులను వేధించిన కేసులో కంప్యూటర్ టీచర్ కు మద్దతు ఇచ్చిన ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ ను సస్పెండ్ చేశారు. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
యూపీలోని షాహజహాన్ పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటనలో తిల్హార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 18మంది బాలికలకు మంగళవారం ఎక్స్ రే పరీక్షలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులను కంప్యూటర్ టీచర్ మహమ్మద్ అలీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనికి ప్రిన్సిపాల్ అనిల్ పాఠక్, మరో టీచర్ సాజియా మద్దతు ఇచ్చినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రియాంకా జైన్ వెల్లడించారు.