Site icon Prime9

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి

Road Accident

Road Accident

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాని వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ లో సుమారు 40 మంది శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య

మరో వైపు ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలోని కొండపిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయుకుడి భార్యను ట్రాక్టర్ ఢీకొనడం కలకలం రేపుతోంది. వైసీపీ నాయకులే ట్రాక్టర్ ఢీ కొట్టి హత్య చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version