Ghat Kesar former MPTC Murder :మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎంపిటిసి గడ్డం మహేష్ హత్య కేసులో ఘట్ కేసర్ పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక లావాదేవీలు , అక్రమ సంబంధాల నేపథ్యంలో మహేష్ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ఘట్ కేసర్ అంబేద్కర్ నగర్ కు చెందిన అనిగల శ్రీనివాస్, కడుపోల్ల ప్రవీణ్ అనే వ్యక్తులకు మృతుడు మహేష్ కు మధ్య ఉన్న పలు భూవివాదాలు హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
శ్రీనివాస్ పై మహేష్ పెట్టిన కేసులు కోర్టులలో నడుస్తున్నాయి. దీంతో ఈ నెల 14న మహేష్ ను హత్య చేసేందుకు శ్రీనివాస్ , ప్రవీణ్ లు ప్లాన్ చేశారు… ఇందులో భాగంగా ఈనెల 15న తన ఆఫీసు లోనే కలుద్దామని గడ్డం మహేష్ కు ప్రవీణ్ ఫోన్ చేసి పిలిచాడు. మహేష్ తన ఆఫీస్ లోకి రాగానే శ్రీనివాస్, ప్రవీణ్ లు కారం పొడి , కర్రలతో దాడి చేసి.. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం కడుపోల్ల నరేష్, శ్రీరాములు, రాజు అనే వ్యక్తులకు ఫోన్ చేసి పిలిపించి జేసీబీ డ్రైవర్ సోహన్ సహయంతో కొండాపూర్ లోని డంపింగ్ యార్డులో గుంత తీసి మహేష్ మృతదేహాన్ని పాతిపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఘట్ కేసర్ పోలీసులు మహేష్ ను హత్య చేసిన శ్రీనివాస్, ప్రవీణ్ లతో పాటు వారికి సహకరించిన నరేష్ , సోహన్ లను అరెస్టు చేశారు. శవాన్ని పూడ్చేందుకు వీరికి సహకరించిన శ్రీరాములు, రాజు పరారీలో ఉన్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎంపిటిసి గడ్డం మహేష్ హత్య కేసులో ఘట్ కేసర్ పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక లావాదేవీలు , అక్రమ సంబంధాల నేపథ్యంలో మహేష్ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ఘట్ కేసర్ అంబేద్కర్ నగర్ కు చెందిన అనిగల శ్రీనివాస్, కడుపోల్ల ప్రవీణ్ అనే వ్యక్తులకు మృతుడు మహేష్ కు మధ్య ఉన్న పలు భూవివాదాలు హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.