Odisha Tragedy: ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు. పలువురి క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మరో ట్రాక్ లోని వెళ్లడంతో మాటలకంతని విషాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు నివేధిక ఇచ్చారు.
(ఘటనా స్థలంలో ప్రధాని నరేంద్రమోదీ)
ప్రమాదం జరగడానికి కొంచెం ముందు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోని వెళ్లిందని నివేదిక పేర్కొంది. చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మెయిన్ లైన్ కి బదులుగా లూప్ లైన్ లోకి వెళ్లింది. మెయిన్ లైన్ లో చెన్నై వెళ్లేందుకు అప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శుక్రవారం 6.55 గంటలకు బహానా స్టేషన్ దాటిన కొంత సేపటికే ఈ రైలు పొరపాటున లూప్ లైన్ లోకి ప్రవేశించింది. సిగ్నలింగ్ వ్యవస్థలో మానవ తప్పిదం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చు అని రైల్వే అధికారి వెల్లడించారు.
కాగా, కోరమాండల్ లూప్ లైన్ లోకి వెళ్లినప్పటికే అక్కడ గూడ్స్ రైలు నిలిచి ఉంది. ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. దీంతో లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలు ను గుర్తించినా.. వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినట్టు తెలుస్తోంది. గూడ్స్ ను ఢీకొట్టగానే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్.. గూడ్స్ రైలు మీదకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు.