Site icon Prime9

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ హెల్త్ సెంటర్‌లో నర్సు పై సామూహిక అత్యాచారం

RAPE

RAPE

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి, నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. నిందితుల్లో 17 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నలుగురు నిందితులు దాడిని రికార్డ్ చేశారని, పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామని బెదిరించారని నర్సు ఆరోపించింది.

మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా పనిచేస్తున్న బాధితురాలిని కట్టేసి, ఆమె గొంతును బిగించి, ఆపై ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నర్సు తల్లిదండ్రులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు ఈ ఘటన పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. భూపేష్ భగెల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు నిరసనలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల బృందం తమకు భద్రత కల్పించాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము పనిచేయబోమని వారు హెచ్చరించారు.

Exit mobile version