Site icon Prime9

Noida: ఫ్యాషన్ షో లో విరిగిపడిన లైట్స్ స్తంభం.. మోడల్ మృతి

Noida

Noida

Noida: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న సమయంలో లైట్లను అమర్చిన ఇనుప స్తంభం ప్రమాదవశాత్తూ మీదపడింది. ఈ ఘటనలో ఓ మోడల్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. నోయిడా ఫిల్మ్‌ సిటీ లోని లక్ష్మీ స్టూడియోల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Model Vanshika Chopra dies after lighting truss falls during fashion show at Film City in Noida lclp

 

లైట్ల స్తంభం అదుపు తప్పడంతో

ఫ్యాషన్‌ షో కోసం ర్యాంప్‌వాక్‌ పక్కన అమర్చిన లైట్ల స్తంభం అదుపు తప్పడంతో అది ఒక్కసారిగా ర్యాంప్‌పై పడిపోయింది. ఆ సమయంలో 24 ఏళ్ల వన్షికా చోప్రా అక్కడ వాక్ చేస్తోంది. దీంతో ఆ స్తంభం ఆమె మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన వన్షికను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీరాజ్‌ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఈ ఫ్యాషన్‌ షో నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

 

Exit mobile version
Skip to toolbar