Site icon Prime9

Minor Student Raped: పదవ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం

Minor Student Raped

Minor Student Raped

Minor Student Raped: ఏలూరు జిల్లా మండల కేంద్రమైన మండవల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బాలికను బెదిరించారు . ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలోనే ఈ నెల 15న మార్కుల మెమోను తీసుకునేందుకు పాఠశాలకు వచ్చింది .ఆ సమయంలో టీచర్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా.. తోటి విద్యార్థి బాలికను వెంబడించి తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు . ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీశారు.

వాట్సప్‌ గ్రూపుల్లో వీడియో పోస్ట్..(Minor Student Raped)

బాలికకు వీడియో చూపించి తమ కోరికను కూడా తీర్చాలని బలవంతం చేశారు. అంతేగాక తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించారు. రూ.2లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పినా ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేశారు. దాంతో పాటు వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో బాలిక తల్లి తండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీడియోను గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసిన నలుగురిని అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

Exit mobile version