Site icon Prime9

Mosh Pub Cheating Case: మోష్‌ పబ్‌ చీటింగ్‌ కేసును ఛేదించిన మాదాపూర్ పోలీసులు

Mosh Pub

Mosh Pub

Mosh Pub Cheating Case: మోష్‌ పబ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్‌ కేసును ఛేదించినట్లు మాదాపూర్‌ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు ముఠా గ్రూప్‌గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ఎరవేసి యువకులను ట్రాప్‌ చేసి వారి పేర్లను మార్చి డేటింగ్‌ సైట్స్‌లో ఫోటోస్‌ పెట్టి చాట్‌ చేసినట్లు వెల్లడించారు.

పక్కా ప్లాన్ తోనే..(Mosh Pub Cheating Case)

యువకులను ట్రాప్‌ చేసి దగ్గర్లోని పబ్బులకు తీసుకెళ్లే వారని తెలిపారు. వీరికి ఆ పబ్‌లో సపరేట్ క్యూ ఆర్ కోడ్ మెషిన్, సపరేట్ గా సర్వ్ చేసే వాళ్ళు ఉంటారని, వారు డెవిల్స్ నైట్‌ పేరుతోఅమ్మాయితో వచ్చిన కస్టమర్ కి ఇచ్చేవారని వివరించారు. అల్కహాల్ సేవించిన అనంతరం బిల్లింగ్ అనంతరం యువతి అక్కడి నుంచి పారిపోయే వారని చెప్పారు. ఇలా బిల్లులు ఎక్కువ మొత్తంలో ఇచ్చి వారి వద్దనుంచి అధిక మొత్తాలు లాక్కునే వారని డీసీపీ పేర్కొన్నారు.నిందితులు ఢిల్లీలోని డెవిల్స్ నైట్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. వారు టిండర్, హింజ్ మరియు బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించడానికి అమ్మాయిలను నియమించుకున్నారు. వారు బాధితులను మోష్ పబ్‌కు రప్పించారు, ఖరీదైన ఆహారం , పానీయాలను ఆర్డర్ చేసి బిల్లులు ఎక్కువగా వచ్చేలా చేసారు. ఈ కుంభకోణం ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లలో అమలు చేయబడింది, నాగ్‌పూర్‌కు విస్తరించే ప్రణాళికతో. వారు పేలవమైన గూగుల్ రేటింగ్‌లు ఉన్న పబ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు . ఇలా వీకెండ్స్ లో సుమారుగా 60 మంది కస్టమర్‌లను రూ. 30 లక్షలకు పైగా మోసం చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో రూ.40 లక్షల విలువైన ఎనిమిది స్మార్ట్ మొబైల్ ఫోన్లు, రెండు కార్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ ను పట్టుకున్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి మల్లేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకట రమణ, కానిస్టేబుళ్లు ఎల్ జగన్, కేశవులను డీసీపీ అభినందించారు.

Exit mobile version