Muchumarri Girl Rape Case: ఏపీలో సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీతో నిందితులను అరెస్ట్ చేశారు. కేసు రీ కన్ స్ట్రక్షన్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈనెల 7న బాలిక మిస్ అయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు మైనర్లకు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది.
ఈ కేసు పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడయాకు తెలిపారు. గత వారం రోజుల క్రితం బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, చంపేసి హంద్రీనివా కేసీ కెనాల్‌లో పడేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. అయితే బాలిక ఆచూకి కోసం వారం రోజులుగా కృష్ణానదిలో ఎస్డీఆర్‌ఎఫ్ , గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా బాలిక ఆచూకిని గుర్తించలేక పోయారు.బాలిక మృతదేహానికి బండరాయి కట్టి వనమాలపాడు వద్ద కృష్ణానదిలో పడేశారని తెలిపారు ఎస్పీ. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఉన్నవారిని అదుపులో తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని… విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్పీ.
ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి మర్డర్ చేశారని.. హత్య చేసి కంప చెట్లలో పడేశాక పెద్దవాళ్లకు సమాచారం ఇచ్చారని చెప్పారు. కేసు నుంచి పిల్లలను కాపాడేందుకు నిందితుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ చెప్పారు. ఒక చిన్నారి చెప్పిన సమాచారంతోనే నిందితులు ఎవరో బయటపడిందని.. మృతురాలితో పాటు ఒక బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. ఆ పాపనే నిందితులను గుర్తించిందన్నారు.పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచిచారు. పిల్లలు సెల్‌ఫోన్ వీడియోలు చూసే ఈ నేరానికి పాల్పడ్డారని.. పార్కులో చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు మృతదేహాన్ని నదిలో వేశారని ఎస్పీ వివరించారు.