Kerala Boat: కేరళలో బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. ఈ పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది దుర్మరణం చెందడం అందరిని కలచివేసింది.
తీవ్ర విషాదం.. (Kerala Boat)
కేరళలో బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. ఈ పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది దుర్మరణం చెందడం అందరిని కలచివేసింది.
మలప్పురం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. తనూర్ ప్రాంతంలో రాత్రి హౌస్ బోట్ బోల్తాపడింది. టికెట్ల పరంగా చూస్తే.. ఇందులో 30 మంది ఉన్నట్లు సమాచారం. అయితే.. 30మందికి మించి ఇందులో ఎక్కువగా పడవ ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు.
దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 22 మంది మృతదేహాలను వెలికితీశారు. 8 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
ఇంకా గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్ఎఫ్, భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అండర్‌వాటర్ కెమెరాల సాయంతో గల్లంతైన వారి కోసం అన్వేషిస్తున్నారు.
మృతుల్లో చిన్నారులు..
22 మంది మృతుల్లో ఏడుగులు చిన్నారులు ఉండటం విషాదం నింపింది. దీంతో పాటు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేరళ మీడియా కథనాలు వెల్లడించాయి.
వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విహారయాత్రకు వచ్చి వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కారణాలు ఇవే..
పడవ బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పడవ యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అంతేగాక, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలికి సీఎం..
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
బోటు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులకు సాయం అందించాలని పిలుపునిచ్చారు.