Site icon Prime9

Karnataka : కర్ణాటకలో దారుణం .. కోడలిపై కోపంతో సొంత మనవడి గొంతు కోసి చంపిన కసాయి అత్త.

karnataka baby murdered news

karnataka baby murdered news

Karnataka : కర్ణాటకలో చోటుచేసుకున్న దారుణం. క్రూరత్వంతో నిండిన ఓ మహిళ చేతిలో భళి అయిన పసివాడి ప్రాణం. కనికరం లేని కసాయిలా  పసి ప్రాణాన్ని చిదిమేసింది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్‌ని చంపినట్లు వెలుగులోకి వచ్చింది.

నాగరత్న తన తల్లిదండ్రుల ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో అద్విక్‌కి జన్మనిచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి మూడు నెలల క్రితం అత్తగారింటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. చిన్న వయసులో బిడ్డకు జన్మనివ్వడంతో నాగరత్నం బిడ్డని పెటుకొని ఇంట్లోనే ఉంటూ సంపాదన లేకుండ పనులు తన పై వేస్తుందని సరోజా తన కోడలు నాగరత్నపై పగ పెంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 22న తాను ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లానని, తిరిగి వచ్చే సరికి చిన్నారి కనిపించలేదని, అత్త సరోజాని అడిగితే తగిన సమాధానం చెప్పకపోవడంతో నాగరత్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానం ఉన్న వారు ఎవరు అని ఆడగగా సరోజా పేరు చెప్పాగా , గట్టిగా విచారణ చేయగా సరోజా తన నేరాన్ని అంగీకరించింది. పసికందును గొంతుకోసి చంపేసి ఆ తర్వాత మడ అడవుల్లో పాతిపెట్టినట్లు ఒప్పుకుందని గజేంద్రగఢ్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం పంపారు. సరోజ బిడ్డకు తినకూడని పదార్థాలు తినిపించేదని నాగరత్న పోలీసులకు వెల్లడించింది. అయినా కూడా తన అత్తగారు ఇంత దారుణానికి ఒడికడతారని ఎప్పుడూ అనుకోలేదని నాగరత్న కన్నీరుమున్నీరైంది. చిన్న బిడ్డని తన ఇంట్లో వాళ్ళే చంపడం ఎంత దారుణమో చూడండి.

Exit mobile version