Site icon Prime9

Kaleswaram: కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం.

Kaleswaram SI

Kaleswaram SI

 Kaleswaram: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌పై వేటు పడింది. ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై భవానీసేన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. లైంగికంగా వేధించినట్టు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐను డిస్మిస్ చేశారు.

ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లకు వేధింపులు..( Kaleswaram)

కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో విచారణ చేశారు. విచారణలో ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని తెలిసింది. ప్రస్తుతం సదరు ఎస్సై పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఎస్సై సర్వీస్ రివాల్వర్‌ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

Exit mobile version