Site icon Prime9

Adibatla Kidnap Case : హైదరాబాద్ యువతి కిడ్నాప్ కేసులో బయటపడుతున్న మరో యాంగిల్… నిజమేనా ?

interesting-details-revealed-in-hyderabad-young-girl-kidnap-case

interesting-details-revealed-in-hyderabad-young-girl-kidnap-case

Hyderabad Kidnap Case : హైదరాబాద్ లోని ఆదిభట్లలో తాజాగా జరిగిన యవతి కిడ్నాప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినిమా రేంజ్ లో జరిగిన ఈ కిడ్నాప్ తతంగంలో టీ ఫౌండర్ నవీన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పట్టపగలే అందరూ చూస్తుండగా సుమారు వంద మంది వచ్చి యువతి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి… ఆమెని ఎత్తుకెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా బీబీఏ పూర్తి చేసిన వైశాలి డెంటల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే అంత మంది కలిసి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లడంతో అసలు వీళ్ల స్టోరీ ఏంటని అంతా ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలోనే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నవీన్ రెడ్డి, వైశాలికి గతంలోనే పరిచయం ఉందని వీళ్లిద్దరిదీ ఒకే సామాజిక వర్గం అని తెలుస్తుంది. వైశాలి చదువు పూర్తి కావడంతో పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. అప్పటికే నవీన్ వైశాలి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం అయ్యాడు. కోవిడ్ సమయంలో వైశాలికి, నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అలా వాళ్ల పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇక ఇద్దరి మధ్య స్నేహం ఉండటంతో.. ఇక పెళ్లి ప్రస్తావన రాగా.. ఇద్దరి ఈడూ జోడూ బాగుంటుందని, అతను కూడా మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకోవటంతో పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో వీరు చెట్టాపట్టలేసుకొని బాగానే కలిసి తిరిగినట్లు సమాచారం అందుతుంది. అయితే ఏమైందో తెలియదు కానీ నవీన్ రెడ్డితో వైశాలి కుటుంబసభ్యులు పెళ్లి వద్దనుకున్నారు.

ఇక ఇంట్లో వాళ్లు సర్ధిచెప్పటంతో వైశాలి కూడా పెళ్లికి నో చెప్పింది. కానీ నవీన్ అమ్మాయి ఇంటి ముందున్న స్థలాన్ని లీజుకు తీసుకుని గ్లాస్ హౌస్ నిర్మించుకున్నాడు. మళ్ళీ ఆమెతో స్నేహం పెంచుకునే యత్నం చేస్తుండేవాడు. దీంతో వైశాలి కుటుంబసభ్యులు నవీన్ రెడ్డిపై కంఫ్లైంట్ కూడా ఇచ్చారు. ఇక నిన్న వైశాలికి పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలియడంతో వాళ్లింటికి వెళ్లి గొడవ చేసి అమ్మాయిని తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా చివరికి పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేసి నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నల్గొండ నుంచి విజయవాడ వైపు పారిపోతుండగా నవీన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ప్రస్తుతం వైశాలి, నవీన్‌ రెడ్డిలను పోలీసులు ఒకే చోట విచారిస్తున్నారు. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా 2021 ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల టెంపుల్‌లో తమ వివాహం జరిగిందని నవీన్‌ వెల్లడించనట్లు సమాచారం అందుతుంది. బిడిఎస్ కంప్లీట్ అయ్యేదాకా పెళ్లి ఫొటోస్ బయటకు రావొద్దని వైశాలి కండీషన్ పెట్టిందని… 2021 జనవరి నుంచి తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు. వైశాలి కుటుంబ సభ్యులు కూడా చదువు పూర్తవగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని… తనతో డబ్బులు ఖర్చుపెట్టించారని వెల్లడించినట్లు సమాచారం. మరి చివరకు ఈ కేసులో ఏం తెలుస్తుందో.

Exit mobile version