Site icon Prime9

జార్ఖండ్‌: భార్యను 12 ముక్కలుగా నరికిన భర్త.. కారణం మొదటి భార్యేనా..?

Jharkhand

Jharkhand

Jharkhand: ఢిల్లీలో శ్రద్దావాకర్ ఉదంతాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. అదేతరహా కేసు ఒకటి తాజగా జార్ఖండ్‌లో బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌గంజ్‌లో తన భార్య మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

శనివారం సాయంత్రం సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలోని పాత ఇంటిలో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రుబికా పహాడిన్ అనే మహిళను ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రుబికా దిల్దార్‌కు రెండో భార్యని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా రుబికా ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై సాహెబ్‌గంజ్ ఎస్పీ మాట్లాడుతూ సాహిబ్‌గంజ్‌లో ఆదిమ గిరిజన వర్గానికి చెందిన 22 ఏళ్ల మహిళ శరీరం యొక్క 12 భాగాలు కనుగొనబడ్డాయి. శరీరంలోని కొన్ని భాగాలు ఇంకా కనిపించలేదు. వాటి కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఆమె భర్త దిల్దార్ అన్సారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు.నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును ఉపయోగించి మహిళ మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Exit mobile version