Site icon Prime9

Gang Rape : అస్సాంలో దారుణ ఘటన.. తల్లీకూతుళ్లపై 8 మంది అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

gang rape case in assam about 8 members raped mother and daughter

gang rape case in assam about 8 members raped mother and daughter

Gang Rape : అస్సాంలోని గువాహటిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలు రాని ఓ మూగ తల్లి, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాధితుల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు. మే 17న ఈ ఘటన జరగ్గా ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గౌహతిలోని సత్‌గావ్ తల్తాలాలో ఓ మహిళ తన 22 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. అయితే 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తి సదరు మహిళలో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో అరుణ్ ప్రధాన్ కొడుకు అమిత్ ప్రధాన్, మరో ఏడుగురు నిందితులు మే 17న బాధితుల ఇంటిలోకి ప్రవేశించి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ప్రైవేట్ భాగాలపై కారం చల్లారు. ఈ దారుణ ఘటనతో తల్లీకూతుళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి.. పోలీఎస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు తరలించారు. అత్యవసర వైద్యసేవలు అందించి ఆసుపత్రి అధికారులు ఇద్దరి ప్రాణాలను కాపాడారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా మొదట బాధితులను బెదిరించి మీడియాకు సమాచారం ఇవ్వకుండా.. యత్నించారని కానీ చివరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగు లోకి వచ్చినట్లు తెలుస్తుంది. పరారీలో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version