Site icon Prime9

Fraud in the Name of Loan: రుణం పేరుతో మోసం .. ఆదోని వాసికి టోకరా ఇచ్చిన సైబర్ మోసగాళ్లు

loan Fraud

loan Fraud

 Fraud in the Name of Loan:రుణం పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్ళు. కర్నూలు ఆదోని పట్టణం ఇందిరానగర్ ఎరుకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకల వెంకటరాముడు రోజు కూలీ పనులకు వెళ్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.నాలుగు రోజులు కిందట ఓ మహిళా ఫోన్ చేసి.. తమ ఫైనాన్స్ సంస్థ మీ పేరు పై 5లక్షలు రుణం మంజూరు చేశారని..మీకు డబ్బులు కావాలంటే రుణం ఇస్తామని చెప్పారు.

1.07 లక్షలు ఫోన్ పే చేసి..( Fraud in the Name of Loan)

దీనితో వెంకటరాముడు వెంటనే నాకు రుణం కావాలని సమాధానం ఇచ్చాడు.అయితే రుణం మంజూరుకు అవసరమైన ప్రాసెసింగ్ కోసం ముందుగా 3,500 చెల్లించాలని చెప్పడంతో…ఆయన ఫోన్ ఫే ద్వారా నగదు పంపించారు.ఇలా మూడు రోజుల వ్యవధిలో ఫీజుల పేరుతో మొత్తం 1.07 లక్షలు ఫోన్ పే చేశారు.అయితే రుణం డబ్బులు ఎంతకూ తన ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వెంకటరాముడు ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తనకు న్యాయం చేయాలని బాధితుడి కోరుతున్నాడు.

Exit mobile version