Ex-Army murders wife, boils body parts in cooker in Hyderabad: మృగాన్ని మించిన కిరాతకం.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షకుడు. సమాజం సిగ్గు పడేలా అమానీయ ఘటన.. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం. మనిషిగా పుట్టిన ఎవడైనా ఇలా చేస్తాడా? క్రైమ్ సినిమాలను అన్ని కలిపి ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసి రిటైర్‌మెంట్ పొందిన గురుమూర్తి.. తన భార్యను అతి కిరాతకంగా చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటన హైదరాబాద్ నగరాన్ని షేక్ చేస్తోంది.
అయితే మీర్‌పేట మర్డర్ కేసులో మృతదేహం ఆనవాళ్లు ఇప్పటికీ ఆచూకీ కనిపించలేదు. కానీ గురుమూర్తి తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. డెడ్ బాడీ ఆనవాళ్లు ఒక్కటీ దొరక్కుండా మర్డర్ చేసినట్లు తెలుస్తోంది. హత్య అని నిర్ధారించే ఆనవాళ్ల కోసం గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వంటగదిలోనూ, చెరువులోనూ ఎక్కడా కూడా ఆనవాళ్లు కనిపించడం లేదు.
గురుమూర్తి ఈనెల 15న మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత 16న మాధవి ఇంట్లోంచి వెళ్లిపోయిందని అత్తమామలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఏమీ తెలియనట్లు 18న అత్తమామలతో కలిసి పోలీస్ స్టేషన్‌లో భార్య మిస్సింగ్ చెందినట్లు ఫిర్యాదు చేశాడు. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. మాధవి ఇంట్లోకి వెళ్లి బయటకు వెళ్లలేదు. దీంతో విచారణలో తానే హత్య చేసినట్లు గురుమూర్తి వెల్లడించాడు. కాగా, భార్యపై అనుమానంతో చంపినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని చంపి ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు అన్ని విద్యలు ప్రదర్శించాడు. మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా చేసి తొలుత కుక్కర్‌లో ఉడికించాడు. ఆ తర్వాత అన్ని ముక్కలను ఇంట్లో ఆరబెట్టి.. ఎముకలను కాల్చి దంచి పొడిగా మార్చాడు. ఈ పొడిని అనుమానం రాకుండా కవర్లలో తీసుకెళ్లి డ్రెయినేజీతో పాటు స్థానికంగా ఉండే చెరువులో పడేశాడు. అయితే తన భార్యను చంపడానికి ముందే గురుమూర్తి ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. ఈ కేసు మీర్ పేట పోలీసులకు సవాల్‌గా మారింది. త్వరలోనే అన్ని వివరాలు వివరిస్తామని పోలీసులు చెబుతున్నారు.